ఐదు రోజుల వ్యవధిలో నలుగురు శిశువుల జననం.. వైద్య శాస్త్రంలోనే అత్యంత అరుదైన ఘటన!
- ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ ఆస్పత్రిలో ఘటన
- మే 9న తొలి శిశువు.. మే 14న మరో ముగ్గురు శిశువుల జననం
- హై-రిస్క్ ప్రెగ్నెన్సీ అయినప్పటికీ సాధారణ కాన్పు ద్వారానే ప్రసవం
- తల్లీబిడ్డలు క్షేమం, నియోనాటల్ కేర్ యూనిట్‌లో చిన్నారులకు చికిత్స
- వైద్యుల అప్రమత్తతతో తల్లి, నలుగురు శిశువుల ప్రాణాలు సురక్షితం
వైద్య శాస్త్రంలోనే అత్యంత అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో చోటుచేసుకుంది. ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించడం అరుదైతే, ఇక్కడ ఏకంగా ఐదు రోజుల వ్యవధిలో ఒకే తల్లి నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో కూడిన ఈ హై-రిస్క్ కేసులో సాధారణ కాన్పు ద్వారానే ప్రసవం చేసి, తల్లీబిడ్డలను కాపాడి వైద్యులు తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.
సంభాల్ జిల్లా ఓబ్రి గ్రామానికి చెందిన అమీనా (31) గర్భం దాల్చింది. రెండో నెలలో చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ఆమె గర్భంలో వేర్వేరు సంచులలో నాలుగు పిండాలు పెరుగుతున్నాయని వైద్యులు గుర్తించారు. గర్భధారణ సమయంలో అమీనా కాలేయ సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటుతో పలుమార్లు ఆస్పత్రిలో చేరారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు నిరంతరం పర్యవేక్షించారు.
ఈ క్రమంలో, ఆరు లేదా ఏడో నెలలో ఉన్న అమీనాకు మే 8న నొప్పులు రావడంతో మొరాదాబాద్‌లోని టీఎంయూ ఆస్పత్రిలో చేర్చారు. మే 9న, ఆమె కేవలం 710 గ్రాముల బరువున్న ఓ మగ శిశువుకు సాధారణ ప్రసవం ద్వారా జన్మనిచ్చింది. అయితే, మిగతా ముగ్గురు శిశువుల జననం వెంటనే జరగకపోవడం వైద్యులను ఆశ్చర్యపరిచింది.
వెంటనే అప్రమత్తమైన వైద్య బృందం, అమీనా ఆరోగ్య పరిస్థితిని స్థిరీకరించి, ప్రసవాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంలో సఫలమయ్యారు. ఐదు రోజుల పాటు ఆమెను నిరంతర పర్యవేక్షణలో ఉంచారు. చివరకు మే 14న అమీనాకు మళ్లీ నొప్పులు మొదలయ్యాయి. ఈసారి ఆమె ఒక మగబిడ్డ, ఇద్దరు ఆడ శిశువులకు సాధారణ కాన్పు ద్వారానే జన్మనిచ్చింది.
ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. నలుగురు శిశువులను నియోనాటల్ కేర్ యూనిట్‌లో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఒక శిశువు ఆరోగ్యం స్థిరంగా ఉండగా, మిగతా వారికి ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై శిశువుల తండ్రి ఆలిమ్ మాట్లాడుతూ "నా భార్య, పిల్లలు క్షేమంగా ఉండాలని మాత్రమే ప్రార్థించాం. వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటాం" అని భావోద్వేగంతో తెలిపారు. డాక్టర్ శుభ్రా అగర్వాల్ నేతృత్వంలోని వైద్య బృందం ఈ అసాధారణ ప్రసవాన్ని విజయవంతం చేసింది. నలుగురు కవలల కేసుల్లో సాధారణ కాన్పు జరగడం అత్యంత అరుదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.